తెలంగాణ సచివాలయం ప్రారంభం….తొలి సంతకం ఆ ఫైలుపైనే

-

 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నూతన సచివాలయం ఆదివారం ప్రారంభం కానుంది. ముందుగా తెల్లవారుజామున 5:30 గంటలకు పూజ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. సచివాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డులో సుదర్శన యాగం నిర్వహించనున్నారు.

అయితే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ నూతన సచివాలయ భవనంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి ఇవాళ మంత్రి కే. తారకరామారావు అడుగుపెట్టబోతున్నారు. నూతన సచివాలయం మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్ ఇకనుంచి తన విధులను నిర్వర్తించనున్నారు.

చారిత్రాత్మకమైన నూతన సచివాలయం నుంచి తన విధులను ప్రారంభించనున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇవాళ అత్యంత కీలకమైన ఫైలుపైన మొదటి సంతకం చేయనున్నారు. హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాల ఫైలు పైన మంత్రి కేటీఆర్ తొలి సంతకం చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version