చరిత్ర రిపీట్ అవుతుందని కేటీఆర్ ట్వీట్.. నెటిజన్ స్ట్రాంగ్ కౌంటర్..!

-

బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగడం లేదు. రోజుల వ్యవధిలో ఎవరూ ఊహించిన ఇద్దరు కీలక నేతలు గులాబీ పార్టీని వీడారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ు కేసీఆర్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అయితే వరుస పార్టీ ఫిరాయింపులపై ట్విట్టర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు. 2004-06 సమయంలో ఇలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పిరాయింపులు చేసిందని.. కానీ ప్రజల పోరాటాలకు తల వంచిందన్నారు. హిస్టరీ మళ్లీ రిపీట్ అవ్వడం పక్కా అని చెప్పారు.

ఈ ట్వీట్ కి ఓ నెటిజన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. చేసిన పాపాలు అనుభవించక తప్పదు.. అప్పుడు మీ టైం.. ఇప్పుడు వాళ్లది అని కేటీఆర్ ట్వీట్ కరెక్ట్ అంటూ ఓ ఫొటో కామెంట్ కి జత చేశారు. 2014-23లో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డామని.. తెలంగాణ ప్రజల పోరాటానికి బీఆర్ఎస్ తల వంచిందంటూ తెలిపాడు. హిస్టరీ రిపీట్ అయిందని తెలిపాడు. ఆనాడు టీడీపీ, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నారు కదా అంటూ ఫైర్ అయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news