రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణకు కసరత్తు షురూ

-

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణానికి భూసేకరణకు కసరత్తు షురూ అవుతోంది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంలో తొలివిడతగా సంగారెడ్డి నుంచి తూప్రాన్‌ వరకు నిర్మించే రహదారి కోసం భూ సేకరణకు రంగం సిద్ధమవుతోంది. ఆ మార్గం వెళ్లే ప్రాంతాల్లో భూముల ప్రస్తుత యజమానులు ఎవరన్నది నిర్ధారించే సర్వే చేపట్టేందుకు వీలుగా జాతీయ రహదారుల సంస్థ కసరత్తు చేపట్టింది. త్వరలో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ మార్గం నిర్మాణానికి సుమారు 236 ఎకరాలు సేకరించాల్సి ఉంది. సంగారెడ్డి, నర్సాపూర్‌, తూప్రాన్‌, గజ్వేల్‌, జగదేవ్‌పూర్‌, భువనగిరి, చౌటుప్పల్‌ వరకు 158.50 కిలోమీటర్ల ఉత్తర భాగం రహదారిని నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన విషయం తెలిసిందే.

ఇందులో తొలి విడతగా 60 కిలోమీటర్ల రహదారిని నిర్మించాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. భూ సేకరణకు అయ్యే వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం మొత్తాన్ని చెల్లించాలి. ఆ మొత్తాన్ని దశలవారీగా ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేయటంతో ఉత్తర భాగాన్ని దశలవారీగా చేపట్టాలని జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news