లైవ్ డెబిట్ లో tv 5 మూర్తి విశ్వరూపం..జైలు కైనా రెడీ…!

2014 వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం జరుగుతున్నప్పుడు రాజ్య సభలో జరిగిన చర్చలు ఆన్ రికార్డుతో సహా వెలికితీస్తానన్న tv 5 మూర్తి. అప్పుడు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం తీసుకువచ్చింది.ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటీస్ ఇస్తామన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ నుండి అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు గారు ఐదు సంవత్సరాలు అయితే సరిపోవని పది సంవత్సరాలు కావాలని అప్పుడే మేము బిల్లుకి చట్టరూపం లో మద్దతిస్తాం అని అన్నారు.

 

 

 

ఆ తరువాత యూపీఏ , ఎన్డీఏ కలిసి పార్లమెంటు సెంట్రల్ హాల్లో ఫ్లోర్ మీటింగ్ పెట్టుకుని ప్రధాని మన్మోహన్ సింగ్ తో ఐదు సంవత్సరాల స్పెషల్ కేటగిరి స్టేటస్ ప్రకటన చేయించారని మూర్తి అన్నారు. అయితే దీన్ని ప్రశ్నించినందుకు మమ్మల్ని జైల్లో వేస్తామ్ అనడం సరికాదని బిజెపి నేత ప్రకాశ్ రెడ్డి పై tv 5 మూర్తి అసహనం వ్యక్తం చేశారు.మూర్తి అనే నేను జర్నలిజానికి కలంఖం తెస్తున్నాను అని ప్రకాష్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను జైల్లో పెట్టే అధికారం పార్లమెంట్ స్పీకర్ కి, అసెంబ్లీ స్పీకర్ కి ఉందని, నేను జర్నలిస్ట్ నీ “లా” స్టూడెంట్ ని అని మూర్తి అన్నారు.అవసరమైతే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానన్నారు.