“మన మునుగోడు-మన కాంగ్రెస్” పోస్టర్ స్టిక్కర్ విడుదల చేసిన రేవంత్

మునుగోడు ఉప ఎన్నిక రాజకీయం రోజురోజుకు వేడి రాజుకుంటోంది. తెరాస, భాజపా, కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు ఘాటుగా విమర్శలు ఎక్కుపెడుతూ మునుగోడు ప్రజలను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి.. కీలక ప్రకటన చేశారు.

మన మునుగోడు, మన కాంగ్రెస్ పోస్టర్, స్టిక్కర్ విడుదల చేశారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. రేపు 20వ తేదీన స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో 176 గ్రామాలలో జయంతి వేడుకలు నిర్వహిస్తోంది టీపీసీసీ.

ఇందులో భాగంగానే తెలంగాణ లోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ జెండాలు ఎగురవేసి, రాజీవ్ గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించనున్నారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ట్వీట్‌ చేశారు. కాగా..వారం రోజుల కిందట కరోనా బారీన పడ్డ రేవంత్‌ రెడ్డి.. తాజాగా కోలుకున్నారు. రేపు మునుగోడులో రేవంత్‌ రెడ్డి పర్యటించే ఛాన్స్‌ ఉంది.