ఐ స్టాండ్ ఫర్ వారియర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా జయహో ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎందరో పుడతారు,చస్తారు కానీ కొందరే గుర్తు ఉంటారని పేర్కొన్నారు. త్యాగధనులను గుర్తు చేసుకోవాలని సూచించారు. మానవ సమాజం త్యాగాల పునాదులపై ఏర్పడిందని, త్యాగం లేకపోతే వ్యర్థమని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు.
భారత స్వాతంత్ర్యం కోసం ఎందరో త్యాగం చేశారని గుర్తు చేశారు. ఆగస్టు 15న మధ్యాహ్నం 12 గంటలకు దేశ ప్రజలంతా లేచి నిలబడి, జాతీయగీతం ఆలపించాలని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు.