ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మావోయిస్టుల కలకలం

ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తిరిగి తమ ఉనికిని కాపాడుకోవడం కోసం మావోయిస్టు దళాలు ప్రవేశించాయని సమాచారం అందడంతో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి. గత కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు రెక్కీ నిర్వహిస్తున్నారన్న సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, యాక్షన్ కమిటీ సభ్యుడు పాండు అలియాస్ దళాలు ప్రవేశించాయని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. పెద్దపల్లి, గోదావరిఖని, మంథని, కాలేశ్వరం ప్రాంతాలు, కోల్డ్ బెల్ట్ ఏరియాలలో మావోల సంచారం పై ఇంటెలిజెన్స్ ఆరా తీసింది.

మావోయిస్టుల హిట్ లిస్టులో ఉన్నట్లు ప్రచారం అవుతున్న నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. జిల్లా సరిహద్దు ప్రాంతాలలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కూలీలుగా మావో యాక్షన్ టీంలు ప్రవేశించినట్లు సమాచారంతో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు.