మాస్టర్ ప్లాన్ జీవోని రద్దు చేయాలి – జీవన్ రెడ్డి

-

జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట రైతులు జగిత్యాల – ధర్మపురి రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. రైతుల ధర్నాకి పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. మాస్టర్ ప్లాన్ లో రిక్రియేషన్ జోన్, ఇండస్ట్రియల్ జోన్, సెమీ పబ్లిక్ పబ్లిక్ జోన్ల లో నర్సింగపూర్, తిమ్మాపూర్, తిప్పన్నపేట, గోపాలరావు పేట, లింగం పేట, హస్నాబాద్, అంబర్ పేట, మోతే, కండ్లపల్లి తదితర గ్రామాలను చేర్చడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు.

పరిశ్రమల జోన్ నివాసిత ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు జీవన్ రెడ్డి. పరిశ్రమల జోన్ ఏర్పాటు తో భవిషత్ లో కాలుష్యం పెరిగిపోతుందన్నారు. పరిశ్రమలుగా గుర్తించిన భూముల్లో ఇళ్ల నిర్మాణాలకు అనుమతి లభించదన్నారు. సాగు చేసుకుంటూ జీవిస్తున్న ప్రజల భూములను ఆంక్షలతో విలువలు తగ్గిపోయే ప్రమాదం ఉందనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆందోళనలు పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ను తాత్కాలికంగా నిలిపి వేయడం కాదు.. నిర్మాణాత్మకంగా చర్యలు చేపట్టాలన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతులు కడుపు కాలి రోడ్డెక్కుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. మాస్టర్ ప్లాన్ జీవో ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news