దళితులకు కేసీఆర్‌ మరో శుభవార్త..ప్రభుత్వ ఆస్పత్రుల కాంట్రాక్టుల్లోనూ కోటా !

-

దళితుల అభ్యున్నతికి దళిత బంధుతో శ్రీకారం చుట్టుని కేసీఆర్‌ స ర్కార్‌.. మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, పోషకాహాక ఏజెన్సీల కాంట్రాక్టుల్లో 16 శాతం దళితులకు కేటాయించినట్లు మంత్రి హరీష్‌ రావు ప్రకటన చేశారు.

ఈ ప్రక్రియను నిన్న కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో హరీష్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కెసిఆర్ ప్రారంభించిన దళిత బందు కేవలం కార్యక్రమం కాదు.. ఇదొక ఉద్యమమని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. దళితులకు డబ్బులు పంచడం మాత్రమే పరిష్కారం కాదు.. సామాజిక అస్పృశ్యతను తొలగించాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యం అని వెల్లడించారు. దళిత బంధు లబ్ధిదారులు సరైన యూనిట్ ఎంపిక చేసుకునేలా.. ఆ యూనిట్ ను గ్రౌండ్ చేసేలా ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక్కొక్కరు ఒక్కో లబ్ధిదారునికి మార్గనిర్దేశం చేస్తున్నారని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news