మునుగోడు ఉపఎన్నిక కాంట్రాక్టర్ మదంతో వచ్చింది – కేటీఆర్

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో మునుగోడు లోని సంస్థాన్ నారాయణపూర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మునుగోడు ఉప ఎన్నిక ఓ కాంట్రాక్టర్ మదంతో వచ్చిందని అన్నారు. గాడిదలకు గడ్డి వేసి.. ఆవులకు పాలు పిండితే వస్తాయా? మునుగోడు ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎమ్మెల్యే అమ్ముడు పోవడం కారణంగానే ఈ ఉప ఎన్నిక వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. రూ.18 వేలకోట్లకు మునుగోడు ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు.

గ్యాస్ ధర భారీగా పెంచింది కేంద్రమని.. ప్రతిదీ రెట్లు పెరిగి సామాన్యుడి జీవితం దుర్బరం అయ్యిందన్నారు. ఇవన్నీ పెరగడానికి మోడీ కారణమని.. పైసలు పడేసి కొంటానని చూస్తోంది బీజేపీ అని ఆగ్రహించారు. ఫ్లోరోసిస్ సమస్య తో బాధ పడింది మునుగోడు అని.. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ఇంటింటికి ఇచ్చారన్నారు. కానీ ఇన్నేళ్లలో మిగితా వాళ్ళు ఎందుకు చేయలేదు.. 24 గంటల కరెంట్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తు చేశారు కేటీఆర్.