రాచరికం కాదు.. ముందు గవర్నర్ వ్యవస్థను తొలగించాలి : మంత్రి కేటీఆర్

-

రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. రాచరిక వ్యవస్థను కాదు ముందు బ్రిటీష్ కాలం నాటి గవర్నర్ వ్యవస్థను తొలగించాలని అన్నారు.విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు నెరవేర్చేందుకు కేంద్రానికి.. ఇది చివరి బడ్జెట్ అని సూచించారు.

గత ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం ఒక్కటంటే ఒక్కటి కొత్త రైల్వే ప్రాజెక్ట్ ఇవ్వలేదని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం వివక్ష చూపుతోందని మండిపడ్డారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను చెప్పింది ఏదైనా అబద్దమని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్దమని కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు.. కేంద్రం ఈ బడ్జెట్‌లోనైనా నిధులివ్వాలని కోరారు. రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్రం కన్నా.. కేంద్రం తక్కువ ఖర్చు చేస్తోందని విమర్శించారు. విభజన చట్టం ప్రకారం కాజీపేట కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉన్న బీజేపీ నేతలకు కేంద్రాన్ని అడిగే సత్తా లేదని ఆరోపించారు. రైల్వేశాఖమంత్రి అశ్విని వైష్ణవ్‌కు బీఆర్ఎస్ తరఫున లేఖ రాసినట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version