TSPSC పేపర్ లీకేజ్ పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..వారి అంతు చూస్తాం

-

TSPSC పేపర్ లీకేజ్ పై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు. పేపర్‌ లీకేజీపై సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చాం.. సీఎం ఆదేశాలతో సమీక్ష నిర్వహించామని వివరించారు మంత్రి కేటీఆర్‌. ప్రజలకు నిజానిజాలు తెలియజేయాలని సీఎం తెలిపారన్నారు మంత్రి కేటీఆర్.

గత ఎనిమిదేళ్లలో TSPSCలో ఎన్నో సంస్కరణలు చేపట్టామని.. ఇప్పటి వరకు 99 పరీక్షలు నిర్వహించాని గుర్తు చేశారు. యూపీఎస్సీ చైర్మన్‌ రెండు సార్లు వచ్చి మన సంస్కరణలను అధ్యయనం చేశారని వెల్లడించారు మంత్రి కేటీఆర్. వ్యక్తులు చేసిన తప్పులతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోంది.. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు ఎంతో మందిని బాధపెడుతోందన్నారు.

 

ప్రవీణ్‌, రాజశేఖర్‌ వెనక ఎవరు ఉన్నా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు మంత్రి కేటీఆర్. కాగా.. TSPSC పేపర్ లీకేజ్ కేసులో తొమ్మిది మంది నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. చంచల్‌గూడ జైలు నుంచి సిట్‌ కార్యాలయానికి తరలించారు. ఆరు రోజుల పాటు తొమ్మిది మంది నిందితులను ప్రశ్నించునున్న సిట్.. ఈ నెల 23 వరకు కస్టడీ నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news