అల్లు అర్జున్ అరెస్టుపై మంత్రి సీతక్క హాట్‌ కామెంట్స్‌ !

-

అల్లు అర్జున్ అరెస్టుపై మంత్రి సీతక్క హాట్‌ కామెంట్స్‌ చేశారు.  అల్లు అర్జున్‌ అరెస్ట్‌‌పై స్పందించిన మంత్రి సీతక్క…ఆయన తప్పిదం ఉందని గుర్తు చేశారు. చట్టం ఎవ్వరి చుట్టం కాదన్నారు. అల్లు అర్జున్ అరెస్టు చట్టప్రకారం జరిగిందని వెల్లడించారు. అల్లు అర్జున్‌పైన తమకు ఎలాంటి కక్ష లేదని తేల్చి చెప్పారు మంత్రి సీతక్క.

Minister Sitakka’s hot comments on Allu Arjun’s arrest

సినిమా నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే జరిగిందంటూ.. అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఆరోపించడం సరికాదని చురకలు అంటించారు. చట్టం అందరినీ సమానంగా చూస్తుంది. సామాన్య ప్రజల కంటే సెలబ్రిటీలు ఇంకాస్త బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు మంత్ర సీతక్క.

అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించారు ఖైరతాబాద్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్. హీరో అల్లు అర్జున్ మా బంధువంటూ కామెంట్స్‌ చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ కావడం బాధాకరమన్నారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బెయిల్ దొరకడం సంతోషకరమని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version