యాదాద్రీశుడి సాక్షిగా ఒట్టేసి చెప్పండి.. ఓటేస్తానని : ప్రధాన పార్టీ ఎమ్మెల్యే

-

మునుగోడు ఉపఎన్నికలో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ప్రధానంగా పలు గ్రామాలు, మండలాలకు ఇన్‌ఛార్జులుగా ఉన్న ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. తాము ఇన్‌ఛార్జులుగా ఉన్న ప్రాంతాల్లో పార్టీకి ఎలాగైనా మెజార్టీ తీసుకురావాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఓటర్లు అన్ని పార్టీల వద్ద డబ్బు తీసుకుంటున్న నేపథ్యంలో వాళ్లంతా తమవైపే ఉంటారని, తమకే ఓటేస్తారనే నమ్మకం ప్రధాన పార్టీ ఇంఛార్జులకు ఉండటం లేదు. అందుకే ఏకంగా ఓ ప్రధాన పార్టీ నేత 700 మంది ఓటర్లను యాదాద్రి పుణ్యక్షేత్రానికి తీసుకువెళ్లి.. గర్భగుడిలో లక్ష్మీనరసింహ స్వామి ఎదుట ప్రమాణం చేయించారు.

మరోవైపు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నాయి. సామాజిక వర్గాల వారీగా ఇప్పటికే తాయిలాలు ప్రకటించాయి. వ్యక్తిగతంగానూ ‘అడిగిన వాళ్లకు అడిగినంత’ అన్నట్టుగా ఇచ్చేస్తున్నాయి. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ రాజీనామాతో ఆ సామాజికవర్గంలో పట్టు కోల్పోకుండా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యను తిరిగి పార్టీలో చేర్చుకోవడం కూడా టీఆర్ఎస్ అనుసరిస్తున్న ఎత్తుకు పైఎత్తుల్లో భాగమేనని చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news