హైదరాబాద్ నుంచి ఏపీ మీదుగా బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారి 44 రూపు రేఖలు మారబోతున్నాయి. ఇక పై సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. ఈ విషయాన్ని కేంద్రం తెలిపింది. నాలుగు వరుసల నుంచి ఆరు వరుసల రోడ్డుగా మారుస్తున్నామని తెలిపింది. ఈ జాతీయ రహదారి తెలంగాణ సరిహద్దు నుంచి కర్ణాటక సరిహద్దు వరకు ఆంధ్ర ప్రదేశ్ లోన 251 కిలో మీటర్లు ఉంది.
ఇప్పటకే రహదారి విస్తరణకు సర్వే చేస్తున్నారు. త్వరలోనే రియల్ టైమ్ డిజిటల్ వ్యవస్థ అనుసంధానంతో.. సూపర్ ఇన్ఫర్మేషన్ రహదారిగా మారనుంది. త్వరలోనే ట్రాఫిక్, రోడ్డు ప్రమాదాల సమస్య కూడా తీరనుంది.
ట్రాఫిక్ క్లియరెన్స్ సమయంతో.. పాటు ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకునేందుకు అవసరమైన సమాచారం డిజిటల్ బోర్డులపై ఏర్పాటు చేస్తారు. ఈ హైవేను అత్యాధునికంగా మార్చేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అంచనాలు రూపొందించింది. త్వరలో క్షేత్ర స్థాయి పరిశీలనకు రానుంది. ఇప్పటికే సర్వే మొదలైంది. ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసలను ఆరు వరుసల రహదారిగా విస్తరిస్తారు.