తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు

-

తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది.  2017లో నర్సింగ్ విద్యార్దిని అదృశ్యం కేసులో ఎన్​ఐఏ అధికారులు.. హైదరాబాద్, హన్మకొండ, ఏపీలోని కృష్ణా జిల్లాలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్​లోని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి ఇంట్లో 5 గంటలపాటు తనిఖీలు చేశారు. ఇంట్లోని పుస్తకాలు పరిశీలించారు. జ్యోతికి సంబంధించిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. పత్రికకు సంబంధించిన వివరాలు, సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారి వివరాలు సేకరించారు.

హైదరాబాద్‌లోని కన్వీనర్ జ్యోతి ఇంటితోపాటు కృష్ణా జిల్లాలోని కో కన్వీనర్ రాధ, హన్మకొండలోని సభ్యురాలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. పలు డైరీలు, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. తమ కుమార్తె రాధను నర్సింగ్‌ చదివిస్తామని 2017లో హైదరాబాద్‌ నుంచి నరేందర్‌ అనే వ్యక్తి తీసుకువెళ్లాడని అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందని యువతి తల్లి పోచమ్మ ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేశారు. జూన్‌ 3న ఎన్​ఐఏ మరో కేసు నమోదు చేసి..ర్యాప్తు ప్రారంభించింది. అప్పట్లో చైతన్య మహిళ సంఘంలో పనిచేసిన శిల్ప, దేవేంద్ర, స్పప్న, నరేందర్‌ నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. ఇదే కేసులో మరోసారి సోదాలు జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news