YSR బిడ్డవైతే మునుగోడులో పోటీ చేసి సత్తా చూపించు – నిరంజన్ రెడ్డి కౌంటర్

-

తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డికి.. తెలంగాణ వైసీపీ పార్టీ అధినేత షర్మిలకు మధ్య వివాదం రేగుతూనే ఉంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి నియోజకవర్గం లో పాదయాత్ర చేస్తోంది షర్మిల. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి నిరంజన్ రెడ్డి తనపై గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసి, సిగ్గుండాలి కదా, చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి నిరంజన్ రెడ్డి కూడా అదే రేంజ్ లో సమాధానం ఇచ్చారు. వైయస్సార్ బిడ్డ అయితే మునుగోడులో పోటీ చేసి నీ సత్తా ఏంటో చూపించు అంటూ సవాల్ విసిరాడు. ఆంధ్ర నుంచి వచ్చిన షర్మిలకు తెలంగాణ ఏం అని నిలదీశారు. కాగా..మొన్నటి ప్రెస్‌ మీట్‌ లో నిరంజన్‌ రెడ్డిపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెప్పుతో కొడతారంటూ ఫైర్ అయ్యారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Latest news