ఒపీనియన్ పోల్: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు!

-

సోలిపేట రామలింగారెడ్డి మరణంతో.. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే! ఈ ఎన్నిక మామూలు పరిస్థితుల్లో అయితే యునానిమస్ గా ముగిసేదేమో కానీ… తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నో ఫార్మాలిటీస్, నో సెంటిమెంట్స్.. ఓన్లీ వార్ అన్న పద్దతిలో జరగనున్నాయి! ఈ క్రమంలో తాజాగా ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక జరిపిన ఆన్ లైన్ ఒపీనియన్ పోల్ లో వెలువడిన సంగతులు ఇప్పుడు చూద్దాం!

తెరాస నాయకులు చెబుతున్నట్లుగా దుబ్బాక లో వార్ వన్ సైడ్ అయితే కాదు అనే చెబుతుంది ఈ ఒపీనియన్ పోల్! ఇక్కడ కాంగ్రెస్ – తెరాస – బీజేపీలు ఎవరికి వారే అన్నట్లుగా రసవత్తరంగా ముందుకు పోతున్నాయి. తెలంగాణలో వారి భవిష్యత్తుకు ఇది మరో బలమైన పునాది కావాలని బీజేపీ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే! ఈ ఎన్నికను బండి సంజయ్ కూడా చాలా ప్రిస్టేజ్ గా తీసుకున్నారు!

ఇదే విషయంలో… రాబోయే కాలంలో కాబోయే అధికార పార్టీ నేతలం అని చెప్పుకోవడానికి – తెలంగాణలో తెరాస పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని ప్రపంచానికి చాటడానికి… ఈ ఉప ఎన్నికను తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా ప్రిస్టేజ్ గా తీసుకున్నారనేది తెలిసిన విషయమే! ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపొందితే మాత్రం… వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి – గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వారికి కొత్త బూస్ట్ అందినట్లే!

ఇదే సమయంలో వార్ వన్ సైడ్.. దుబ్బాకలో గెలుపు తెరాసదే అని పైకి గులాబీ నేతలు ఎంత గట్టిగా చెబుతున్నా… లోలోపల చెమటలు పడుతున్నాయనే కామెంట్లు ఆఫ్ ద రికార్డ్ వినిపిస్తూనే ఉన్నాయి! అయితే… ఈ ఉప ఎన్నిక తమ పాలనకు రెఫరెండం అని చెప్పాలా వద్దా అనే మీమాంసలో గులాబీ బాస్ లు ఉన్నారని అంటున్నారు! నిజంగా దుబ్బాకలో గులాబీకి అంత పాజిటివ్ సైన్ ఉండి ఉంటే… ఈ రెఫరెండం డైలాగ్ కేసీఆర్ ఎప్పుడో వేసేవారు. అలా వేయలేదంటేనే… పరిస్థితి అనుకున్నంత, మైకుల ముందు చెబుతున్నంత సులువుగా లేదని తెలుస్తుందని అంటున్నారు విశ్లేషకులు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news