ప‌లువురు తెలుగు రాష్ట్రాల‌ ప్రముఖుల‌కు ప‌ద్మ అవార్డులు

ప్ర‌తి ఏడాది గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌క‌టించే ప‌ద్మ అవార్డుల‌లో ప‌లువురు తెలుగు ప్ర‌ముఖుల‌కు ఈ ఏడాది స్థానం సంపాదించుకున్నారు. ప‌లువురికి ప‌ద్మ అవార్డుతో పాటు ప‌ద్మ భూష‌ణ్ అవార్డుల కూడా ద‌క్కాయి. ప్ర‌జ‌ల‌కు ప‌లు విభాగాల్లో సేవ‌లు అందిస్తే.. ఈ ప‌ద్మా అవార్డుల‌ను కేంద్రం ప్ర‌ధానం చేస్తుంది. కాగ ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల నుంచి ప‌లువురు పద్మా అవార్డుల‌ను గెలుచుకున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన భార‌త బ‌యోటెక్ సీఎండీ డాక్ట‌ర్ కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్ల దంప‌తుల‌కు కేంద్రం ప‌ద్మ భూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించింది. కాగ డాక్ట‌ర్ కృష్ణ ఎల్ల‌, సుచిత్ర ఎల్ల దంప‌తులు.. క‌రోనా వైర‌స్ ను ఎద‌ర్కొవ‌డానికి కొవాగ్జిన్ అనే టీకాను అభివృద్ధి చేశారు. అలాగే ప‌ద్మ అవార్డుల‌ను తెలంగాణ నుంచి ద‌ర్శ‌నం మొగిల‌య్య‌కు తో పాటు ప‌ద్మజా రెడ్డి, రామ చంద్ర‌య్య అందుకోనున్నారు. అలాగే ఆంధ్ర ప్ర‌దేశ్ నుంచి ప‌ద్మ అవార్డుల‌ను న‌ర్సింహ రావు గ‌రిక‌పాటి తో పాటు సుంక‌ర వెంక‌ట ఆది నారాయ‌ణ, షేక్ హ‌స‌న్ తీసుకోనున్నారు. కాగ షేక్ హ‌స‌న్ ఇటీవ‌లే మ‌ర‌ణించారు.