ఈటల మీద డిఫార్మేషన్ కేసు వేస్తానని వార్నింగ్ ఇచ్చింది పాల్వాయి స్రవంతి. ఇవాళ ఈటల వ్యాఖ్యలపై పాల్వాయి స్రవంతి స్పందించారు. బీజేపీ పరిస్థితి బాగోలేక పోతే… ఎదుటి వారిపై బట్ట కాల్చి వేయడం అలవాటేనని చురకలు అంటించారు. ఎన్నికల సమయంలో కూడా బీజేపీ దుష్ప్రచారం చేసింది బీజేపీ అని మండిపడ్డారు. మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసింది బీజేపీ అని ఆగ్రహించారు.
పోలింగ్ రోజు… కేసీఆర్ ని కలిశానని మార్ఫింగ్ చేసి ప్రచారం చేసింది బీజేపీనని.. కాంట్రాక్టర్ ని కొనడానికి బీజేపీ తెచ్చిన ఉప ఎన్నిక మునుగోడు అని విమర్శలు చేశారు. విచారణ సంస్థలు అన్ని మీ చేతిలోనే ఉన్నాయి కదా… ఆధారాలు బయట పెట్టు.. విచారణ చేయించాలని డిమాండ్ చేశారు పాల్వాయి స్రవంతి. మేము గౌరవించే వ్యక్తి ఈటెల అని.. ఇప్పుడా గౌరవాన్ని పోగొట్టుకున్నారని ఫైర్ అయ్యారు పాల్వాయి స్రవంతి.