తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి

-

ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇటీవల మృతిచెందిన తెల్గారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కృష్ణయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళ్లర్పించారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఆయన మృతికి కారణమైన వారికి కఠినమైన శిక్ష తప్పకుండా పడుతుందన్నారు.

అనంతరం మండలంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట తెరాస రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, తోట చిన్న వెంకటరెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిశోర్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రతాపనేని రఘు తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news