కేసీఆర్‌ ఇప్పటికీ కుటుంబ సర్వే లో పాల్గొనలేదు – మంత్రి పొన్నం

-

కేసీఆర్‌ ఇప్పటికీ కుటుంబ సర్వే లో పాల్గొనలేదని విమర్శలు చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌. రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో పాల్గొనండి అంటూ విజ్ఙప్తి చేశారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగిందని… రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు ,అధికారులు , ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యుమరెటర్స్ నీ పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న అంటూ పేర్కొన్నారు.

ponnam prabhakar on KCR

రాజకీయాలు లేవు గతంలో టిఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చాము…ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేలు పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదని ఆగ్రహించారు. రాజకీయ పార్టీల నాయకులందరూ కుల సర్వే కు సహకరించాలని కోరారు. సమాచారాన్ని ఇవ్వకుండా బీసీ లకు వ్యతిరేకంగా ఈ సర్వే నిర్వహణకు వ్యతిరేకంగా మీలో భావం ఉంటే చెప్పండి అన్నారు. ప్రభుత్వం తీసుకున్న సర్వే లో మీరు లేకుండా ఉంటే మంచిది కాదని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version