జర్నలిస్టులకు పోస్టల్ బ్యాలెట్ ఓటు

-

తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో తొలిసారిగా జర్నలిస్టులు, 12 ఇతర విభాగాల ఉద్యోగులకు EC పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. FCI, AAI, PIB, AIR, విద్యుత్ శాఖ, రైల్వే, వైద్యరోగ్య శాఖ, RTC, పౌరసరాఫరాల శాఖ, BSNL, వార్తల సేకరణ కోసం EC నుంచి పాస్ పొందిన జర్నలిస్టులు, ఫైర్ సిబ్బందికి కొత్తగా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించారు.

Postal ballot vote for journalists

వీరంతా నవంబర్ 7వ తేదీలోగా ఫారం-12Dకి దరఖాస్తు చేయాలి. కాగా, కొత్తఓటర్లకు నెలాఖరు నుంచి ఓటరు గుర్తింపు కార్డుల పంపిణీ జరగనుంది. ఈఏడాది రెండు విడతలుగా ఓటర్ల జాబితా ప్రకటించారు. 2023 జనవరి నుంచి కొత్తగా 40 లక్షల దరఖాస్తులను అధికారులు పరిష్కరించారు. జనవరి1 నుంచి 27 లక్షలా 50 వేలకు పైగా ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి తపాలా శాఖ ద్వారా ఓటర్ల చిరునామాలకే పంపిచారు. ఆ తర్వాత కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారికి సంబంధించిన గుర్తింపు కార్డుల ముద్రణ కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చారు. మిగిలిన వారి కార్డుల ముద్రణ పూర్తిచేసి పంపిణీ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version