గవర్నర్ తమిళిసై పై ప్రశాంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు

-

గవర్నర్ తమిళిసై పై ప్రశాంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిలిసై తను రాజ్యాంగబద్ద పదవిలో ఉన్నాననే మర్చిపోయిందని.. కేసిఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకురాలి పాత్ర పోషిస్తుందని మండిపడ్డారు. ప్రజలచే ఎన్నుకోబడిన కేసిఆర్ ను కేంద్రంచే నియమించబడిన గవర్నర్ ఎలా విమర్శిస్తుంది..?మోడీ ఏది చెప్తే గవర్నర్ అదే మాట్లాడుతుందని ప్రశ్నించారు.

గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ప్రభుత్వాలను కూలదోస్తున్నారు.. పార్టీలకు అతీతంగా ఉండాల్సిన గవర్నర్ రాజ్ భవన్ లో బీజేపీ నేతలతో సమావేశాలు ఎలా పెడతారు..? అని నిలదీశారు. గవర్నర్ అధికార పర్యటనలు ప్రభుత్వానికి,అధికారులకంటే ముందే బీజేపీ వాళ్లకు ఎలా తెలుస్తుంది..?దీని వెనుక ఉన్న మతలబు ఏంది..? అన్నారు. ఏమన్నా అంటే ఈడి,సీబీఐ కేసులు పెడతామంటున్నారు.. మోడీ లకు, ఈడిలకు కేసిఆర్ భయ పడడు…దేనికైనా సిద్ధమే..! అని సవాల్‌ విసిరారు. “ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేరదాకా తరిమికొట్టు- నీ ప్రాంతం వాడే మోసం చేస్తే ఇక్కడే పాతరెయ్యి”అన్న కాళోజీ మాటలు బీజేపీ కి వర్తిస్తాయి.. వ్యవసాయాన్ని కూడా అదాని,అంబానీలకు దారాదత్తం చేసి రైతు నోట్లో మట్టి కొట్టే కుట్ర చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news