ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మూర్ము జూలై 12 న హైదరాబాద్ కు రానున్నారు. జూలై 12న మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు ద్రౌపది ముర్ము చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆమె బిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు లను కలవనున్నారు. ఒడిశాలోని సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.
కాగా 2015 నుంచి 2021 వరకు జార్ఖండ్ గవర్నరుగా పనిచేసిన ముర్ము రాజకీయాల్లో కిందిస్థాయి పదవి నుంచి అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్రపతి అభ్యర్థి స్థాయికి చేరుకున్నారు. అన్నీ అనుకూలిస్తే భారత దేశానికి రాష్ట్రపతి అయ్యే తొలి గిరిజన మహిళ గా ద్రౌపది చరిత్ర సృష్టించనున్నారు.