మహిళల ఆత్మ గౌరవం కోసం హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం

-

మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న రాచకొండ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షీ టీమ్స్ ఎంపవరింగ్ రూరల్ అస్పిరెంట్స్ అనే ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం కింద గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ మేరకు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ మహిళా విభాగం, రాచకొండ పోలీస్ కమిషనరేట్ భాగస్వామ్యం అయ్యారు. త్వరలోనే పహాడీషరీఫ్ లో ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ వంటి శిక్షణ ఇస్తారు. ఇందుకు వందల సంఖ్యలో దరఖాస్తులు రాగా, తొలి విడతలో 50 మంది మహిళలను ఎంపిక చేశారు. వీరిని రెండు బ్యాచ్ లుగా విభజించి, రోజుకు నాలుగు గంటల చొప్పున ఆరు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత ధృవీకరణ పత్రం అందజేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news