తెలంగాణలో రేప్ లు, మర్దర్లు, క్రైమ్ రేటు పెరిగింది – రాజాసింగ్

-

తెలంగాణలో రేప్ లు, మర్దర్లు, క్రైమ్ రేటు పెరిగిందని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ ఘటన మరువకముందే మరో ఘటన జరిగిందని…మొఘల్ పురలో మరో మైనర్ ను కిడ్నాప్ చేసి రేప్ చేశారని విమర్శించారు. టిఆర్ఎస్ నేతల వల్ల తెలంగాణ గడ్డ రేప్ ల గడ్డగా మారింది..తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందని సీఎం, హోంమంత్రి, కేటీఆర్ డప్పులు కొడుతున్నారని మండి పడ్డారు.

కేసీఆర్.. ఒక్కసారి ఏసీ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చి చూడండని పేర్కొన్నారు. తెలంగాణలో రేపులు, మర్దర్లు, క్రైమ్ రేటు పెరిగింది…ప్రజలకు పోలీసులంటే భయం పోయిందని తెలిపారు. మా నాన్న టీఆరెస్ లో, ఎంఐఎం పార్టీలో ఉంటే మేము సేఫ్ అనే భావనకు నేతల పిల్లలు వచ్చారని ఫైర్ అయ్యారు. జూబ్లీహిల్స్ రేప్ కేసు నిందితులు ఈ ఒక్క ఘటన మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో చేసి ఉంటారనుకుంటున్నానని.. నిందితులపై నార్కోటిక్ టెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు.సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో వారిపై విచారణ జరిపించాలి..మేము చేసిందే రాజ్యం.. చెప్పిందే వేదమని సీఎం నేతలు భావిస్తున్నారన్నారు. క్రైమ్ రేటు తగ్గింపుపై దృష్టి సారించండి. లేదంటే గద్దెనెక్కించిన ప్రజలే గద్దె దింపేస్తారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news