కేటీఆర్ కి రాజాసింగ్ కౌంటర్.. ఆ సినిమా చూడాలంటూ..

రాజ్యసభ నుండి టిఆర్ఎస్ ఎంపీలతో పాటు వామపక్షాల ఎంపీలను 10 రోజులపాటు సస్పెండ్ చేయాలని నిర్ణయించడం సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా మండిపడ్డారు. అయితే మంత్రి కేటీఆర్ ట్వీట్ పై బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కేటీఆర్ ఈ రకంగా ట్వీట్ చేసే అర్హత నీకు లేదని ఆయన అన్నారు.”గతం మర్చిపోయావా.. మా ముగ్గురు బిజెపి ఎమ్మెల్యేలను అసెంబ్లీ సెషన్ మొత్తం మీరు సస్పెండ్ చేయలేదా? ఈరోజు మీరు సస్పెన్షన్ గురించి మాట్లాడతారా? మీరందరూ కలిసి ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు?”అంటూ మండిపడ్డారు.

అలాగే కాలక్షేపానికి ఓటిటి లో మంచి షోలను సూచించాలని కేటీఆర్ అడిగిన ప్రశ్నకి విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే విషయంపై రాజాసింగ్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.”కాలు విరిగిందని ఇంట్లో కూర్చున్నావు కదా.. నేను ఒక సినిమా చెబుతాను చూసుకో “కాశ్మీర్ ఫైల్స్”సినిమా చూడు. లేకపోతే మోడీ స్పీచ్ కానీ, అటల్ బిహారీ వాజ్పేయి హిస్టరీ కానీ చూడు.. మంచి మనిషివి అవుతావు. నీకు ఇదే నా అడ్వైస్” అని అన్నారు.