రాముడి ఫోటోతో రూ.500 నోట్లు కావాలి – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

-

రాముడి ఫోటోతో రూ.500 నోట్లు కావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. రాముడి ఫొటో ఉన్న రూ.500 నోట్లను ప్రధాని రిలీజ్ చేయాలని, ఇది 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ అని రాజాసింగ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు ఒక దశ దిశ లేదు…పదవులు అనుభవిద్దమనే ఆలోచన తో ఉన్నారని ఆగ్రహించారు. తిరోగమన దిశలో ప్రభుత్వం పోతుంది…కాళేశ్వరం మెడిగడ్డ ప్రాజెక్ట్ పై జ్యూడిషియల్ విచారణ కాలయాపన కోసమేనని ఫైర్‌ అయ్యారు.

rajasingh on ram note

గతం లో CBI విచారణ చేయించాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డీ ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు…ఎవరిని కాపాడడం కోసం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.కెసిఆర్ కుటుంబానికి క్లీన్ చిట్ ఇవ్వబోతున్నారని..ప్రాజెక్ట్ ల నిర్వహణ కృష్ణ బోర్డ్ కి ఇస్తామని ఒకసారి ఇవ్వమని ఒక సారి ఈ ప్రభుత్వం మాట్లాడుతుందని తెలిపారు.కర్ణాటక ను అడిగి నీళ్ళు తెస్తామని మోసం మాటలు చెబుతున్నారు…రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి అదానీ తో ఒప్పందం చేసుకున్నారని నిప్పులు చెరిగారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version