వాటర్ ట్యాంక్ ఎక్కి రేషన్ డీలర్లు నిరసన..!

-

సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని సాయినగర్ లో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. కొత్తగా వచ్చే రేషన్ షాపుల్లో పాత వారికే రేషన్ డీలర్లు కేటాయించాలని వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ బాటిల్ పట్టుకొని ఆందోళన చేపట్టారు. మా రేషన్ షాపులు మాకే కావాలని డిమాండ్ చేస్తున్నారు  కొందరు వ్యక్తులు. కలెక్టర్ స్పందించి మొన్న కేటాయించిన షాపులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని ఆందోళన చేశారు.

పది సంత్సరాల పైగా రేషన్ షాపులు నిర్వహిస్తే ఉన్న పళంగా రద్దు చేస్తే మా కుటుంబాలు రోడ్డున పడేసారు అని అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రి రేషన్ షాపులు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడుతున్నారు అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డిఎస్పి చంద్రశేఖర్ రెడ్డి. అయినప్పటికీ మేము కిందకి దిగమని.. మీరు పైకి రావాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొనడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version