వారందరికీ మాజీ HMDA డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితి వస్తుంది – రేవంత్‌ వార్నింగ్‌

-

అవగాహన లేకుండా అనుమతులు ఇస్తూ సంతకాలు పెడితే మాజీ HMDA డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితి వస్తుందని హెచ్చరించారు సీఎం రేవంత్. రాజకీయంగా నాకు అవగాహన ఉంది, నిర్మాణం లో నిర్మాణ సంస్థలతో చర్చిస్తామన్నారు. మేము అంతకు మేము అపర మేధావులు అని నిర్ణయాలు తీసుకోబోము..అలా నిర్ణయాలు తీసుకుంటే.. మేడి గడ్డ అవుతుందని తెలిపారు.

హైదరాబాద్‌ అభివృద్ధిపై కేసీఆర్‌ చేసిన పనులను కొనసాగిస్తానన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఫైనాన్సిల్ జిల్లాలో నూతన తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..అనంతరం మాట్లాడారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై చంద్రబాబు, వైఎస్సార్‌, కేసీఆర్‌ పేర్లను ప్రస్తావించారు. గత సీఎంలు తీసుకున్న అభివృద్ధి నిర్ణయాలను కొనసాగిస్తానని వెల్లడించారు. హైదరాబాద్‌ అభివృద్ధిపై చాలా మందికి కొన్ని అపోహలున్నాయన్నారు.అపోహలను చర్చించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తెలిపారు. నేను అప్పుడప్పుడు కనిపించే ముఖ్యమంత్రిని కాదు.. రెగ్యులర్‌గా కనిపిస్తానని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version