రేవంతన్న కొంపముంచేలా ఉన్నావుగా!

-

ప్రస్తుత రాజకీయాల్లో అధికార పార్టీకి సపోర్ట్ ఉన్నవారికే అన్నీ పథకాలు దక్కుతున్న విషయం తెలిసిందే…అటు ఏపీ అయిన, ఇటు తెలంగాణ అయిన సరే తమ పార్టీ కాదనే వారికి పథకాలు అందించడం చాలా కష్టమైపోతుంది. ఏపీలో వైసీపీ మద్ధతుదారులకే ప్రాధాన్యత ఉంటుంది..ఇటు తెలంగాణలో టీఆర్ఎస్ మద్ధతుదారులకే ప్రాధాన్యత ఉంటుంది…ఇక ఇతర పార్టీలని బయటపడిన వారికి సంక్షేమ పథకాలు అందడం, ప్రభుత్వం నుంచి లబ్ది జరగడం చాలా కష్టం.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

మరి ఇలా చేయడం కరెక్ట్ కాదనే చెప్పాలి..ఎక్కడైనా సరే అర్హులైన ప్రతి ఒక్కరికీ అండగా ఉండాలి..కానీ ప్రస్తుతం రాజకీయాల్లో అలాంటి సీన్ కనిపించడం లేదు. ఇక ఇదే సీన్ రిపీట్ చేస్తానని,..అధికారంలోకి రాకముందే టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు..ఇలా అధికారంలోకి రాకముందే రేవంత్ ఇలా మాట్లాడటం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఒరిగేది ఏమి లేదని చెప్పొచ్చు..ఎందుకంటే ఇలా కాంగ్రెస్ వాళ్ళకే పథకాలు ఇస్తామని చెప్పడం దారుణమైన విషయం

అయితే కాంగ్రెస్ సభ్యత్వాలు పెంచాలనే క్రమంలో రేవంత్ రెడ్డి కాస్త అదుపు తప్పి మాట్లాడారని చెప్పొచ్చు.. తాము అధికారంలోకి వచ్చిన తరవాత కాంగ్రెస్‌లో సభ్యులుగా చేరిన వారికే సంక్షేమ పథకాల్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని, కాంగ్రెస్‌లో సభ్యులుగా చేరిన వారికే మొదటగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌లో చేరినవాళ్లకే పెన్షన్,  పార్టీలో సభ్యత్వం తీసుకున్న వారికే రైతురుణమాఫీ అమలు చేస్తామని, వాళ్లకే ఆరోగ్యశ్రీ పథకం అందిస్తామని అన్నారు. ఉద్యోగాల్లోనూ కాంగ్రెస్‌లో చేరిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు అధికారంలోకి రాకముందు చేయడం వల్ల ఎలాంటి లాభం ఉండదనే చెప్పాలి..పైగా ఈ మాటలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నట్లు తీసుకుంటే కాంగ్రెస్‌కే డ్యామేజ్ జరుగుతుంది. అంటే సభ్యత్వాలు పెంచాలని రేవంత్ ఇలా మాట్లాడారు గాని…కానీ ఈ మాటల వల్ల కాంగ్రెస్‌కి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి..మొత్తానికి రేవంత్ మాటలు…కాంగ్రెస్ కొంపముంచేలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version