పొంగులేటితో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ

-

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. పొంగులేటి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఫిరోజ్ ఖాన్, ఇతర నాయకులు. వీరి సమావేశం సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. భేటీ అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఆయనని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లుగా వెల్లడించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. పొంగులేటి.. సోనియా గాంధీని కలిసిన తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

కాగా ఏఐసీసీ ఆదేశాల మేరకు పొంగులేటిని కలిశామని తెలిపారు రేవంత్ రెడ్డి. తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదని అన్నారు. రాజకీయ పునరేకికరణ కోసం పునాదులు వేశామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. ఇక రాహుల్ గాంధీని ప్రధాని చేసేంతవరకు పార్టీలో అందరం కలిసి పని చేస్తామని, పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పొంగులేటి, జూపల్లి తో పాటు మరికొంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని కూడా చేర్చుకొని బలపడతామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news