పెట్రో మంట తొమ్మిదో రోజు : మ‌రోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

-

దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు సామాన్యుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాయి. చ‌మురు సంస్థ‌లు వ‌రుస‌గా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతూ.. వాహ‌నాద‌రులకు వ‌ణుకు పుట్టిస్తున్నాయి. మార్చి 22 వ తేదీ నుంచి నేటి వ‌ర‌కు వ‌రుస‌గా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచుతుంది. ఇందులో ఒక 24వ తేదీన ఒక్క రోజు మాత్ర‌మే పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను పెంచ‌లేదు. మిగితా తొమ్మిది రోజుల పాటు పెట్రో మంట పుడుతూనే ఉంది. ఇప్పిటికే లీట‌ర్ పెట్రోల్ ధ‌ర కొన్ని చోట్ల రూ. 115 దాటింది.

అలాగే లీట‌ర్ డీజిల్ ధ‌ర కూడా.. రూ. 100 మార్క్ ను దాటేసింది. తాజా గా ఈ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌రోసారి పెరిగాయి. ప్ర‌తి లీట‌ర్ పెట్రోల్, డీజిల్ పై 80 పైస‌ల చొప్పున పెంచుతూ చ‌మురు సంస్థ‌లు నిర్ణ‌యం తీసుకున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల రెట్టు మ‌రోసారి భారీగానే పెరిగాయి. నేడు పెరిగిన ధ‌ర‌ల‌తో హైద‌రాబాద్ న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ. 115.40 కి చేరింది. అలాగే లీట‌ర్ డీజిల్ ధ‌ర రూ. 101.56 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news