గిరిజన బిడ్డలపై మీకు ఎందుకింత కోపం కేసీఆర్? అంటూ తెలంగాణ సర్కారుపై ధ్వజమెత్తారు బిఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణలో పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులను అక్కడి నుంచి తరలించే క్రమంలో ఓ మహిళను పోలీసులు ఈడ్చివేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ ద్వారా ఫాంహౌస్ ల కోసం, బినామీ కంపెనీల కోసం వేల ఎకరాలను ప్రభుత్వం ఆక్రమిస్తుంది అని ఆయన ఆరోపించారు.
బతుకుతెరువు కోసం గిరిజన మహిళలు పోడు చేసుకుంటే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో పోడు సాగు చేస్తున్న గిరిజనులు అక్కడే గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. వీరు పోడు భూములను ఆక్రమించారని అంటూ పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని గుడిసెల నుంచి బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా గిరిజన మహిళ దుస్తులు ఊడిపోతున్నా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. ఈ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గిరిజన బిడ్డలపై ఎందుకింత కోపం మీకు #KCR? మీరు ధరణి పోర్టల్ ద్వారా ఫారం హౌసులకోసం బెనామీ కంపెనీల కోసం వేల ఎకరాలు ఆక్రమించవచ్చు, కానీ మా అక్కలు బతుకు దెరువుకోసం పోడు చేసుకుంటే తప్పేంటి? https://t.co/IUkZ6UojQQ
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) July 8, 2022