ఇది ఆటవిక రాజ్యం కాదా?? టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపాటు

-

తెలంగాణ గురుకుల సొసైటీ మాజీ కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌‌కుమార్ మరోసారి తనదైన శైలిలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా అధికార పార్టీ నేతలకు ఓ న్యాయం, సామాన్యులకు ఓ న్యాయమా? అంటూ ప్రశ్నలను సంధించారు. రాష్ట్రంలో ఆటవిక రాజ్య మేలుతోందంటూ తీవ్ర విమర్శలు చేశారు.

మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌‌కుమార్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ‘బహుజన రాజ్యం’ రావాలని కోరుతూ రాష్ట్రంలో చురుకుగా పర్యటిస్తున్నారు. ‘ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌’కు వెళ్దామంటూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. అయితే, వీలు చిక్కినప్పుడల్లా అధికార టీఆర్‌ఎస్ ప్రభుత్వం విరుచుకుపడే ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ మరోసారి అధికార పార్టీ దుమ్ముదులిపేశారు.

సిర్పూర్ నియోజకవర్గంలో నమోదైన రెండు ఎస్సీ/ ఎస్టీ అట్రాసిటీ ఎఫ్‌ఐఆర్‌లను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఒకవేళ నిందితులు టీఆర్‌ఎస్ వాళ్లయితే కేసుల విచారణలో ఎలాంటి పురోగతి ఉండదంటూ విమర్శించారు. అలా కాకుండా వేరే పార్టీలకు చెందిన వ్యక్తులు నిందితులైతే విచారణ ఎంతో వేగంగా కొనసాగుతుందని ఆరోపించారు. న్యాయవాదుల అభిప్రాయాలు, అరెస్టులు ఇలా అన్నీ చకచకా జరిగిపోతాయ్ అంటూ విమర్శించారు. ఈ తతంగం మొత్తం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోణప్ప వెనుకుండి నడపిస్తున్నట్లు సమాచారం ఉందని ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది ఆటవిక రాజ్యం కాదా అంటూ టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news