తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు సంబంధించిన వార్తలను మనం ఈ మధ్యే రోజు వహిస్తూనే ఉన్నాము. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేసిన తర్వాత నుండి బస్సులు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఇక తాజాగా మరోసారి ఆర్టీసీ బస్సు వార్తల్లోకి వచ్చింది. రోడ్ పైనే ఆర్టీసీ బస్సును ఆపేసాడు డ్రైవర్. అయితే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నుండి వరంగల్ వెల్లె ఆర్టీసీ బస్సును నడి రోడ్ పైనే ఆపేసాడు డ్రైవర్.
బస్ లో ఉండే కెపాసిటీ 55 మందికి గాను 110 మంది ఎక్కారని డ్రైవర్ తెలిపాడు. అందువల్ల తనకు బస్సు నడిపే సమయంలో సైడ్ వ్యూ మిర్రర్ కనబడట్లేదని తన సమస్య వ్యర్థం చేసాడు. కాబట్టి రోడ్డు మధ్యలో బస్సు ఆపి కొంతమంది ప్రయాణీకులు దిగాలని డ్రైవర్ కోరాడు. కానీ ప్రయాణికులు ఎవరు డ్రైవర్ మాట వినకపోవడంతో.. మధ్యలోనే బస్సును ఆపేసాడు. సమస్య తెలుసుకొని అధికారులు బస్సు వద్దకు చేరుకున్నారు.