హైదరాబాద్‌ వ్యాప్తంగా ఆర్టీసీ ఫార్మసీలు..50 శాతం డిస్కౌంట్ కే మందులు

-

తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తనదైన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీ ఎండీగా… సజ్జనార్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలతో ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకెళ్లారు ఎండీ సజ్జనార్‌. దీంతో పాటు సంస్థను ప్రమోట్ చేయడానికి ఎప్పటికప్పుడు పలు వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు సజ్జనార్.

అయితే… తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరో సంచలన నిర్ఱయం తీసుకుంది. వైద్య సేవలోకి టీఎస్ ఆర్టీసీ అడుగు పెట్టబోతోంది. దీని ప్రకారం సాధారణ ప్రజలకు తక్కువ ధరతో సూపర్‌ స్పెషాలిటీ వైద్య చికిత్సలు అందించనుంది ఆర్టీసీ సంస్థ.

ఇందులో భాగంగానే… హైదరాబాద్‌ మహా నగర వ్యాప్తంగా ఆర్టీసీ ఫార్మసీలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఇక ఈ ఆర్టీసీ ఫార్మసీలలో జనరిక్‌ మందులపై 50 శాతం, బ్రాండెడ్‌ మందులపై 15 శాతం రాయితీ ఉండనుంది. ఆస్పత్రి, ఫార్మసీలను సాధారణ ప్రజలు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఆర్టీసీ అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news