సీఎంను డిసైడ్ చేసేది హై కమాండే.. సచిన్ ఫైలట్ కీలక వ్యాఖ్యలు

-

రాజస్థాన్ లో కాంగ్రెస్ గెలిస్తే.. ముఖ్యమంత్రి ఎవ్వరూ కావాలనేది ఎమ్మెల్యేలు, పార్టీ హై కమాండ్ నిర్ణయిస్తారని హస్తం సీనియర్ నేత సచిన్ పైలట్ అన్నారు. కాంగ్రెస్ ను గెలిపించేందుకు ప్రస్తుతం సీఎం అశోక్ గెహ్లాట్ తాను కలిసి పని చేస్తున్నామని స్పష్టం చేశారు. క్షమించండి. మరిచిపోండి.. ముందుకు సాగండి అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ నాతో చెప్పారు. అందుకే నేను అన్నీ వదిలేసి.. భవిష్యత్ పై ఫోకస్ తో ముందుకు సాగుతున్నాను.

ఎన్నికల తరువాత ఏం చేయాలనేది ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వం డిసైడ్ చేస్తాయని సచిన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఐక్యంగా ఉందని.. వర్గాలు, వివాదాలు బీజేపీలోనే ఉన్నాయి. ఆ పార్టీలో టికెట్ల కేటాయింపు కూడా తప్పుడు పద్దతుల్లో జరిగింది. కాంగ్రెస్ లో మేము కలిసి కూర్చొని మాట్లాడుకొని టికెట్లపై నిర్ణయం తీసుకున్నామని ఆయన వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version