BREAKING : మధ్యాహ్న భోజన కార్మికులకు జీతం రూ.3 వేలు పెంపు

-

తెలంగాణ రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కేసీఆర్ సర్కార్‌ అసెంబ్లీ వేదికగా శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 54231 మంది బుక్ కం హెల్పర్లు గౌరవ వేతనాన్ని వెయ్యి నుంచి మూడు వేలకు పెంచుతున్నట్లు ప్రకటించింది.

వీరికి ప్రస్తుతం గౌరవ వేతనం వెయ్యి రూపాయలు ఇస్తున్నారు అని దానిని మూడు వేలకు పెంచుతున్నట్లు తెలిపారు మంత్రి హారీష్‌ రావు. రాష్ట్రంలో 27 వేల పైచిలుకు పాఠశాలలు ఉండగా… 34 వేలకు పైగా ప్రాథమిక స్కూళ్లు ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోందని.. ఈ విషయాన్ని ఆర్బీఐ చెబుతోందన్నారు.

ప్రభుత్వ పథకాలు లబ్ది దారులకు చేరవేతలో పారదర్శకత పెంచగలిగామని పేర్కొన్నారు. అటు పేదలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం ప్రకటించింది. నియోజకవర్గంలో 2వేల మందికి ₹3లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు శాసనసభలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news