సేమ్ టు సేమ్: కేసీఆర్‌కు బాబు గతేనా?

-

దేశ రాజకీయాల్లో ఏదో మార్పు తీసుకొస్తామని చెప్పి తెలంగాణ సీఎం కేసీఆర్..దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల నాయకులని కలిసే పనిలో ఉన్న విషయం తెలిసిందే..కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్‌ని గద్దె దించడమే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. అందుకే ఈ మధ్య దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలని ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఇప్పటికే మమతా బెనర్జీ, స్టాలిన్, అఖిలేశ్ యాదవ్, తేజస్వి యాదవ్ లాంటి నేతలతో టచ్‌లో ఉన్నారు…అలాగే ఇటీవల దేవేగౌడ, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ లాంటి నేతలని కలిసే పనిలో ఉన్నారు. తాజాగానే ముంబయి వెళ్ళి..ఉద్ధవ్, శరద్ పవార్‌లని కలిసిన విషయం తెలిసిందే. మోడీ ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలనే అంశాలపై చర్చించారు. అయితే కాంగ్రెస్ లేకుండా మోడీ సర్కార్‌ని ఎదురుకోవడం అంత ఈజీ కాదు..దీంతో కాంగ్రెస్‌ని కూడా కలుపుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా కూడా కేసీఆర్ తనవంతు ప్రయత్నాలు చేయొచ్చు.

అయితే ఇప్పుడు కేసీఆర్ చేస్తుందంతా…2019 ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు చేశారు..ఇలా మోడీ సర్కార్‌ని గద్దె దించాలని చెప్పి..మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే, దేవేగౌడ లాంటి నేతలని కలిశారు. ఆఖరికి బద్ధశత్రువైన కాంగ్రెస్‌తో కూడా కలిశారు..రాహుల్ గాంధీని కలిసి..మోడీ సర్కార్‌ని గద్దె దించాలని చూశారు.

కానీ బాబు ప్రయత్నం ఏ మాత్రం వర్కౌట్ కాలేదు…బీజేపీ మళ్ళీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది.ఇటు ఏపీలో టీడీపీ దారుణంగా ఓడిపోయి అధికారానికి దూరమైంది. దీంతో చంద్రబాబు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అప్పటినుంచి బీజేపీపై పోరాటం కూడా చేయడం లేదు. ఏదో రాష్ట్రం వరకు తన పని తాను అన్నట్లు ముందుకెళుతున్నారు. కేసీఆర్ మాత్రం అప్పుడు బాబు చేసిన పని ఇప్పుడు చేస్తున్నారు. అయితే బాబు మాదిరిగానే కేసీఆర్ కూడా దారుణంగా నష్టపోతారని విమర్శలు వస్తున్నాయి..బాబుకు పట్టిన గతే పడుతుందని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. చూడాలి మరి కేసీఆర్ పరిస్తితి ఏం అవుతుందో?

Read more RELATED
Recommended to you

Latest news