వెన్నుపోటు పొడవడంలో కేసీఆర్ దిట్ట – వైఎస్ షర్మిల

-

వెన్నుపోటు పొడవడంలో కేసీఆర్ దిట్ట అని ఫైర్‌ అయ్యారు వైఎస్ షర్మిల. దొర గారికి ఢిల్లీ రాజకీయాల మీద ఉన్న సోయి.. తెలంగాణ రైతుల మీద లేదు.రైతులకు పరిహారం ఎగ్గొట్టి,వెన్నుపోటు పొడవడంలో కేసీఆర్ దిట్ట.గతంలో పరిహారం పేరుతో మిర్చి రైతులను నిండా ముంచిండు.ఇప్పుడు వరి రైతులను నట్టేట ముంచాలని చూస్తుండు.పది రోజుల్లో పరిహారమని నెల రోజులైనా రూపాయి ఇవ్వలేదని విమర్శలు చేశారు.


అకాల వర్షాలకు 10లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా.. దొర గారికి దున్నపోతు మీద వానపడ్డట్టే.పంట నష్టం జరిగిన దానికి పరిహారం ప్రకటించకుండా తడిసిన ధాన్యం కొంటామని చెప్పి, మళ్లీ ఢిల్లీ పయణమైండు సారు.నష్టపోయిన రైతుల్లో సగం మంది కౌలు రైతులు ఉన్నా.. కనీసం పట్టింపు లేదు.రైతులు కన్నీరు పెడుతుంటే కల్లాల్లో ఉండాల్సిన ముఖ్యమంత్రి.. దేశ దోపిడీకి ఢిల్లీకి పయణమైండు. ఇదేనా కిసాన్ సర్కారు? తెలంగాణ సంపదనంతా కొల్లగొట్టి ఇక్కడ గడీలు.. ఢిల్లీలో కోటలు కడుతుండు దొర.తడిసిన ధాన్యం కొనడమే కాకుండా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు షర్మిల.

Read more RELATED
Recommended to you

Exit mobile version