రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపిన- కల్వకుంట్ల కవిత..

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ట్విటర్ వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత. ఏ సంవత్సరం శుభకృత నామ సంవత్సరంగా పిలువబడుతుంది.. అందరికి శుభం కలగాలని కోరుకుంటున్నాళ్ళు తెలిపారు. ఉగాది నాడు పచ్చడి సేవిస్తూ “శతాయు వజ్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వరిష్టాయా వినాశాయ నింబకం దళ భక్షణం” అని చెప్పి పచ్చడి తాగుతామని గుర్తు చేశారు కవిత. పచ్చడి లో షడ్రుచుల వల్లే మన జీవితాలలో కూడా సుఖ దుఃఖాలు ఉంటాయన్నారు..

 

 

 

 

కెసిఆర్ ప్రభుత్వం ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం పై మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మొత్తం తెలుగు వారందరు శుభకృత నామ సంవత్సరంగా చేసుకుంటుంటే, మన తెలంగాణ యువ మిత్రులందరూ ఉద్యోగ నామ సంవత్సరంగా జరుపుకుంటున్నారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అని అన్నారు కల్వకుంట్ల కవిత. మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రైవేట్ లో అనేక పరిశ్రమలు వచ్చి లక్షల ఉద్యోగాలు వస్తూ ఉంటే ప్రభుత్వ రంగంలో కూడా దాదాపు 90 వేల పైచిలుకు ఉద్యోగాల నోటిఫికేషన్ మనం వేసుకోవడం జరిగిందన్నారు. నిరుద్యోగులు అందరూ కూడా ప్రభుత్వం పెట్టినటువంటి “T – SAT ” ఫ్రీ ఛానల్ ని ఉపయోగించుకోవాలన్నారు. “T -SAT ” లో కోర్స్ మెటీరియల్ మొత్తం నిక్షిపేతమై ఉందని, యూట్యూబ్ లేదా టీవీ ఛానల్ ద్వారా అయినా ఉపయోగించుకొని, ఉద్యోగాలు సాధించాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news