రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టారు. 11 నెలల నుండి మాజీ సర్పంచులకు బిల్లులు రాలేదు సీఎం, పంచాయతీ రాజ్ శాఖా మంత్రికి వినతిపత్రం ఇవ్వాలని సర్పంచులు భావిస్తే దొంగల్లా అరెస్టు చేశారు అని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. మాజీ సర్పంచులను పోలీసులు అవమానించారు. తెలంగాణ సర్పంచులు దేశానికి ఆదర్శంగా నిలిచారు. అనేక అవార్డులు తెలంగాణ సర్పంచులకు వచ్చాయి. ఎన్నికల సమయంలో సర్పంచులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సర్పంచులు నేడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. కేంద్రం నుండి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం దారి మళ్ళిస్తోంది.
గ్రామ పంచాయతీలను రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు అవుతున్నాయా లేదా రాహుల్ గాంధీ రివ్యూ చేయాలి. అన్ని వర్గాలను మోసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టు చేసిన సర్పంచులను విడుదల చేయాలి. పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. సర్పంచులకు బిల్లులు ఎందుకు ఇవ్వడం లేదు. గ్రామాలను అభివృద్ధి చేసిన వారికి శిక్ష ఎందుకు. BRS పదేళ్లల్లో 4 లక్షల 26 వేల కోట్లు అప్పు చేశాము. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కాకుండానే 85 వేల కోట్లు అప్పు చేసింది. కాంగ్రెస్ వచ్చాక సంక్షేమ పథకాలు బంద్ పెట్టింది అని పేర్కొన్నారు హరీష్ రావు.