TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీపై ‘సిట్’ దర్యాప్తు

-

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసుపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) దర్యాప్తు చేయనుంది. ఈ కేసును బేగంబజార్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి సిట్‌కు బదిలీ చేస్తూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాలు జారీచేశారు. తదుపరి దర్యాప్తును నగర అదనపు సీపీ (నేరవిభాగం/సిట్‌) ఏఆర్‌ శ్రీనివాస్‌ పర్యవేక్షించనున్నారు.

సీపీ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన సిట్‌.. బేగంబజార్‌ పోలీసుల నుంచి కేసు వివరాలను సేకరించింది. మరోవైపు, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఏఈ, టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌ ప్రశ్నపత్రాలు లీక్‌ అయినట్లు ఇప్పటికే ఆధారాలు లభించాయి. నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ల నుంచి ఏఈ సివిల్‌, టౌన్‌ప్లానింగ్‌ పరీక్షల ప్రశ్నపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఫోన్లు తదితరాలను విశ్లేషిస్తున్నారు. గతంలో జరిగిన పరీక్షలవి.. ముఖ్యంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ప్రశ్నపత్రాలు లీకై ఉంటాయా అన్న అంశంపై దృష్టి పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news