జీడిమెట్లలో సాఫ్ట్‌వేర్‌ కుటుంబం సూసైడ్‌..ఇద్దరు పిల్లలు, భార్యకు విషం ఇచ్చి మరీ !

-

జీడిమెట్లలో విషాదం చోటు చేసుకుంది. జీడిమెట్లలో సాఫ్ట్‌వేర్‌ కుటుంబం సూసైడ్‌ చేసుకుంది. ఇద్దరు పిల్లలు, భార్యకు విషం ఇచ్చి మరీ అనంతరం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఉరేసుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జీడిమెట్ల పరిధి గాజుల రామారం చిత్తారమ్మ దేవాలయం వెనుక బాలాజి లేఔట్ లో సహస్ర రెసిడెన్సీ మూడవ అంతస్తు 303 ఫ్లాట్ లో సాఫ్ట్‌వేర్‌ కుటుంబం సూసైడ్ చేసుకుంది.

ఇద్దరు పిల్లలు, భార్యకు విషం ఇచ్చి చంపిన అనంతరం బెడ్ రూం లో ఫ్యాన్ కు ఉరేసుకొని భర్త సూసైడ్ చేసు కున్నారు. ఈ సంఘటన లో మృతులు మంచిర్యాలకు చెందిన వెంకటేష్ (40),వర్షిణి వారి పిల్లలు రిషికాంత్ (11), విహంత్ (3) గా గుర్తించారు పోలీసులు. హైటెక్ సిటి లోని ఓ కంపనిలో సాఫ్ట్ వేర్ ఎంప్లాయి గా పనిచేస్తున్నాడట వెంకటేష్. ఇక ఈ ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలం చేరుకున్న పోలీసులు..విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version