తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల మునుగోడు ఎమ్మెల్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు భగ్గుమన్నాయి.
అయితే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. మునుగోడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డికి సమర్పించారు.
ఈ నేపథ్యంలోనే.. కోమటి రెడ్డి రాజగోపాల్ రాజీనామకు ఆమోదం తెలిపినట్లు స్పీకర్ కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. ఇక స్పీకర్ తన రాజీనామాకు ఆమోద ముద్ర వేసిన అనంతరం తెలంగాణ గవర్నర్ తమిళి సై అపాయింట్ మెంట్ తీసుకున్నారు. కొందరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని.. స్వార్దం ఉంటే పార్టీ కి రాజీనామా చేయనన్నారు రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నికలకు ఎవరు పోరని.. నన్ను నమ్ముకున్న వల్ల కోసం రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు రాజగోపాల్ రెడ్డి.