బయో ఆసియా సదస్సులో నేడు ‘స్టార్టప్‌ షోకేస్‌’ కార్యక్రమం

-

ఆసియాలోనే అతిపెద్ద లైఫ్ సైన్సెస్, హెల్త్ టెక్ ఫోరం అయినా బయో ఆసియా సదస్సు హైదరాబాద్‌ హెచ్​ఐసీసీలో రెండో రోజు కొనసాగనుంది. అడ్వాన్సింగ్‌ ఫర్‌ వన్‌.. థీమ్‌తో ఏర్పాటైన ఈ సదస్సును నిన్న ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలకు సంబంధించి మొదటిరోజు పలువురు ప్రముఖులతో చర్చ కార్యక్రమాలు జరిగాయి.

ఫ్యూచర్ గ్రోత్ డ్రైవర్ వాట్స్ నెక్స్ట్ ఫర్ ఇండియా అన్న అంశంపై సాగిన చర్చలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. రెండో రోజూ ‘లైఫ్ సైన్సెస్’ విభాగంలో మరిన్ని అంశాలపై చర్చ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇవాళ జరగనున్న ‘స్టార్టప్ షోకేస్’ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు.

మొదటి రోజున బయో ఆసియా సదస్సును ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. లైఫ్ సైన్స్ రంగంలో హైదరాబాద్ అగ్రగామిగా ఉందని.. ఔషధ ఉత్పత్తికి ఆసియాలోనే హైదరాబాద్ పెద్ద నగరమని తెలిపారు. ఈ రంగంలో హైదరాబాద్​కు 7ఏళ్లలో రూ.25 వేల కోట్లు వచ్చాయని.. 800కుపైగా ఫార్మా, బయోటెక్ కంపెనీలున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. మూడింట ఒకవంతు వ్యాక్సిన్ ఉత్పత్తి దేశీయ ఔషధ ఎగుమతుల్లో 30 శాతం తెలంగాణ నుంచే వస్తున్నాయని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news