హైదరాబాద్‌ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు – భట్టి

-

హైదరాబాదులో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు, ఆయనకు భారతరత్న ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు వ్యక్తం చేస్తున్నానని తెలిపారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అసెంబ్లీలో దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానం సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఎందరో పుడతారో మాయం అవుతారు.. కొందరు మాత్రమే ఈ భూమిపై మానవీయ పరిమళాలు వెదజల్లుతారు.. అందులో దివంగత నేత మన్మోహన్ సింగ్ ఒకరన్నారు.

bhatti, manmohan singh

తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుంది . తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింప చేశారని వివరించారు. దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని, నేడు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మన్మోహన్ అన్నారు. మన్మోహన్ సింగ్ ప్రతి పదవికి వన్నె తెచ్చారు. ప్రతి బాధ్యతలో కఠిన నిర్ణయాలు తీసుకున్నారు… దేశ ఆర్థిక పరిస్థితులే కాదు సామాజిక పరిస్థితులు అర్థం చేసుకొని అనేక చట్టాలు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ ఇదే అంటూ వ్యాఖ్యానించారు. సామాన్యుడు సమాచారాన్ని తెలుసుకునే సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చారని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version