ఇప్పటి దాకా టీఆర్ ఎస్ ప్రభుత్వం, అటు ఏపీ ప్రభుత్వం మధ్య కృష్ణా నీళ్లపై తీవ్రమైన వివాదం నడుస్తోంది. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ మంత్రులు చేస్తున్న విమర్శలు తారా స్థాయికి చేరాయి. మంత్రలు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి కలిసి ఏకంగా వైఎస్సార్ ను దొంగ అని జగన్ అయితే గజదొంగ అంటూ సంచలన కామెంట్లు చేశారు. కానీ దీనిపై జగన్ గానీ విజయమ్మ Vijayamma గానీ స్పందించలేదు.
ఇక వారు స్పందించకపోవడంతో టీఆర్ఎస్, షర్మిల కలిసి ఏదో కుట్ర చేస్తున్నారనే అనుమానాలను రేవంత్ రెడ్డి వ్యక్తపరిచారు. ఆయనే కాదు చాలామంది ఇదే ప్రశ్నలను సంధించారు. ఇక అలంటి విమర్శలకు చెక్ పెడుతూ వైఎస్ విజయమ్మ తీవ్రంగా కౌంటర్లు వేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీని షర్మిల ఆవిర్భవించిన సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ తెలంగాణ మంత్రులకు ధీటైన కౌంటర్లు వేశారు. వైఎస్సార్ దొంగ కాదని, ఆయన బిడ్డలు కూడా గజదొంగలు కాదని వారెప్పుడూ ఏపీ, తెలంగాణ ప్రజల కోసమే బతుకుతున్నారని, అందుకోసమే పనిచేస్తున్నారంటూ చురకలు అంటించారు. దీంతో ఇప్పుడు షర్మిలకు కూడా మాట్లాడేందుకు మంచి పట్టు దొరికినట్టయింది. ఇక కాంగ్రెస్ విమర్శలకు కూడా ఆమె చెక్ పెట్టేశారు.